Wednesday, May 1, 2024

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపమాకే…

- Advertisement -
- Advertisement -

Malavika mohanan

 

హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ చేసింది తక్కువ సినిమాలే అయినా బోలెడంత పాపులారిటీ సంపాదించేసింది. ఈ పాపులారిటీ అంతా ఆమె హాట్ అప్పీల్ కారణంగానే వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే ఈ బ్యూటీ ఇదిగో ఇలాంటి హాట్ ఫొటోలతోనే అభిమానుల హృదయాలను కొల్లగొట్టేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో దళపతి విజయ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. అన్నట్టు మాళవిక మోహనన్ చేతిలో ఓ తెలుగు సినిమా కూడా ఉంది. అయితే ఆ సినిమా పరిస్థితేంటో ఎవరికీ తెలియదు. విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రారంభమైన ‘హీరో’ సినిమా అది. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆగిపోలేదని విజయ్ దేవరకొండ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇక మాళవిక విషయానికొస్తే తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో చూసి ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపమాకే’ అంటోంది కుర్రకారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News