Friday, April 26, 2024

రేపటి నుంచే రైలు కూత

- Advertisement -
- Advertisement -

Indian Railways

 

సుదూర ప్రయాణికులను గమ్యం చేర్చనున్న 15 రైళ్లు
దశలవారీగా నడపాలని రైల్వేశాఖ నిర్ణయం
ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు, తిరిగి మళ్లీ అక్కడికే

న్యూఢిల్లీ : సుదూర ప్రయాణికులను గమ్యానికి చేర్చే రైళ్లు తిరిగి ఆరంభం కానున్నాయి. ఈ నెల 12వ తేదీ ( మంగళవారం) నుంచి రైళ్లను దశలవారిగా నడపాలని భారతీయ రైల్వే తలపెట్టింది. కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్‌డౌన్‌తో రైళ్లు నిలిచిపొయ్యాయి. పరిస్థితిని సమీక్షించుకుని దశల వారిగా రైళ్ల పునః ప్రారంభానికి రైల్వే సిద్ధం చేసినట్లు రైల్వే విభాగం అధికారిక ప్రకటన వెలువరించింది. తొలుత 15 రైళ్లు నడుస్తాయి. ఇవి ఢిల్లీ నుంచి నిర్ణీత కేంద్రాలకు వెళ్లి తిరిగి ఢిల్లీ చేరుతాయి. తసోమవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఈ రైళ్లకు టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ ఉంటుంది.

ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్లలో బుక్కింగ్‌లు తిరిగిచేపడుతారు. అయితే ఈ రైళ్లను ప్రత్యేక రైళ్లుగా న్యూఢిల్లీ స్టేషన్ నుంచి నిర్వహిస్తారు. ఇవి దిబ్రూగర్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడగాన్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావిలకు ఈ రైళ్లు వెళ్లుతాయి. తిరిగి దేశ రాజధానికి వస్తాయి. బయలుదేరే స్టేషన్ నుంచి 15 రైళ్లు వచ్చిపోవడం వల్ల మొత్తం 30 రైళ్లు నిర్వహించినట్లు అవుతుంది. రైల్వే స్టేషన్‌లలో టికెటు కౌంటర్లు పనిచేయవని, ప్లాట్‌ఫారం టికెట్లు కూడా జారీ చేయడం జరగదని, ఆన్‌లైన్ ద్వారా https//www.irctc.co.in/ వెబ్‌సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News