Tuesday, April 30, 2024

కస్టడీలోకి మలయాళం నిర్మాత సనల్ కుమార్ శశిధరన్!

- Advertisement -
- Advertisement -

Shashidharan and Manju Warrior
తిరువనంతపురం: అనేక అవార్డులు గెలుచుకున్న మలయాళం సినీ నిర్మాత సనల్ కుమార్ శశిధరన్‌ను కేరళ పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. తన “బతుకు అపాదలో ఉంది” అంటూ సోషల్ మీడియాలో చెప్పడం, “పదేపదే అవమానించడం, బెదిరించడం” చేస్తున్నాడంటూ నటి మంజూ వారియర్ ఫిర్యాదు చేయడంతో కేరళ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తిరువనంతపురం రూరల్ నుంచి కస్టడీలోకి తీసుకుని కొచికి తరలించారు. 2020లో తను నటించిన ‘కయట్టం’ సినిమాకు శశిధరన్ దర్శకత్వం వహించారని, కానీ పదేపదే తనకు సందేశాలు పంపుతూ, సోషల్ మీడియాలో అవమానిస్తూ వేధిస్తున్నాడని నటి మంజూ వారియర్ ఫిర్యాదు చేసింది.
ఆమె మాజీ భర్త, ప్రముఖ నటుడు దిలీప్ నిందితుడిగా ఉన్న 2017 మహిళా నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసును విచారించిన పోలీసు అధికారులపైస కుట్ర పన్నారనే ఆరోపణ కేసుకు సంబంధించి పోలీసులు వారియర్ స్టేట్‌మెంటును ఇటీవల నమోదుచేశారు. పోలీసుల ముందు మంజూ వారియర్ తన వాంగ్మూలం ఇచ్చిన తర్వాత, శశిధరన్ ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ఆమె వాంగ్మూలం తర్వాత దర్యాప్తు బృందం అధిపతిని తొలగించారని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ వారం మొదలులో మంజూ వారియర్ జీవితం అపాదలో ఉందంటూ శశిధరన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. “నా భయాందోళనలకు సంబంధించిన ఈమెయిల్, టెక్స్‌ట్ మెసేజ్‌లను మంజూ వారియర్‌కు పంపాను. నా అనుమానాలను సోషల్ మీడియాలో బయటపెట్టాలని కూడా ఆలోచిస్తున్నాను. అయితే నాకు ఆమె నుంచి ఎలాంటి జవాబు అందలేదు. నాకు వ్యక్తిగతంగా ఈ విషయంలో ఎలాంటి ఆసక్తి లేదు. ఈ విషయంలో నేనో ప్రమాదకర స్థితిలో ఉన్నాని నాకు తెలుసు. మంజూ వారియర్ ముందుకొచ్చి తాను బాగున్నానని, నేను అనవసర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నానని తెలుపాలి. ” అని రాశాడు.
తన సినిమా “ఓళివుడివసతే కలి’కు 2015లో కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును శశిధరన్ అందుకున్నారు. 2017లో అతడి ‘ఎస్ దుర్గా’ అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవం నుంచి డ్రాప్ అయింది. దాంతో అతడు కేరళ హైకోర్టుకు వెళ్లగా అతడికి అనుకూలంగా తీర్పు వెలువడింది. హైకోర్టు ఉత్తర్వు తర్వాత ఫెస్టివల్ జ్యూరీ సభ్యులకు ఆ సినిమా వేసి చూయించారు. తర్వాత వారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సిబిఎఫ్‌సి)ని కోరారు. తర్వాత ఎస్ అంటే సెక్సీఅని ఆ సినిమా పేరు ‘సెక్సీ దుర్గా’ అని వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. చివరికి ఎలాంటి కట్స్ లేకుండా ఆ సినిమాను క్లియర్ చేశారు.

Manju Warrior

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News