Saturday, April 27, 2024

వెనుక నుంచి తోసినట్లు ఆమె భావించి ఉంటారు

- Advertisement -
- Advertisement -

వెనుక నుంచి ఎవరో తోయడం వల్లనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముందుకు తూలిపడి నుదురు, ముక్కుకు గాయాలయ్యాయని ప్రకటించిన 24 గంటల్లోనే ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రి డైరెక్టర్ మణిమోయ్ బందోపాధ్యాయ మాటమార్చారు.. తనను వెనుక నుంచి తోసినట్లు ముఖ్యమంత్రి భావించి ఉంటారని చెప్పడమే తన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ కోల్‌కతాలోని తన కాలిఘాట్ నివాసంలో గురువారం సాయంత్రం కిందపడడంతో మమతా బెనర్జీకి నుదురు, ముక్కుకు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక నుంచి తోయడం వల్లనే తాను కింద పడినట్లు ఆమె(మమత) భావించి ఉండవచ్చని ఆయన తెలిపారు. చికిత్స చేయడం తన బాధ్యతని, దాన్ని తాను నిర్వర్తించానని ఆయన అన్నారు. గురువారం సాయంత్రం తాను చెప్పిన విషయాన్ని కొందరు వక్తీకరించారని ఆయన అన్నారు.మమతను మెనుక నుంచి వెరో తోశారని ఆయన చెప్పిన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అనేక ఊహాగానాలకు ఈ ప్రకటన కారణమైంది. వెనుక నుంచి తోయడం వల్ల మమత తన ఇంట్లో పడిపోయారని బందోపాధ్యాయ గురువారం చేసిన ప్రకటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఆమె నుదుటిపైన మూడు కుట్లు, ముక్కుపైన ఒక కుట్ట వేసినట్లు ఆసుపత్రి డైరెక్టర్ తెలిపారు. అవసరమైన వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రిలో ఆమెకు బ్రెయిజ్ ఇమేజింగ్, ఇసిజి టెస్టులు చేశారు. కొద్ది రోజులు బెడ్ రెస్ట్‌లో ఆమె ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, గత రాత్రి ఆమె గాఢంగా నిద్రపోయారని వారు చెప్పారు. కాగా..ముఖ్యమంత్రి కంద పడిపోవడంపై సాగుతున్న ఊహాగానాల గురించి ఒక పోలీసు అధికారిని వివరణ కోరగా ఘటనపై ఎవరూ ఇంతవరకు ఫిర్యాదు చేయలేదని, ముఖ్యమంత్రి నివాసం వద్ద భద్రతను మరింత పటిష్టం చేశామని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి మమతకు జెడ్ కేటగిరి భద్రత లభిస్తోంది. ఆమెకు ఇంటి వద్ద కూడా ప్రత్యేక భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. నుదుటిపైన రక్తస్రావ గాయంతో ఉన్న మమతా బెనర్జీ ఫోటోలను టిఎంసి గురువారం సాయంత్రం విడుదల చేసింది. మమతను ఆమె మేనల్లుడు, టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తన కారులో ఆసుపత్రికి తీసుకువెళ్లి చేర్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News