Tuesday, April 30, 2024

విష సర్పాన్నయినా నమ్మవచ్చు కాని బిజెపిని నమ్మలేము

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని బిజెపి పాటించడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. విష సర్పాన్ని అయినా నమ్మవచ్చు కాని బిజెపిని నమ్మలేమని ఆమె వ్యాఖ్యానించారు. గురువారం కూచ్‌ఇ బిహార్‌లో ఒక ఎన్నికల సభలో ఆమె ప్రసంగిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలు, బిఎస్‌ఎఫ్, సిఐఎస్‌ఎఫ్ బిజెపి చేతిలో కీలుబొమ్మలుగా మారాయని ఆరోపించారు. అందరికీ సమాన అవకాశాలు లభించేలా చూడాలని ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు. విష సర్పాన్నయినా మీరు నమ్మవచ్చు. కావాలంటే దాన్ని పెంచుకోవచ్చు..కాని బిజెపిని ఎన్నటికీ నమ్మలేరు.. బిజెపి దేశాన్ని నాశనం చేస్తోంది అంటూ మమత మండిపడ్డారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల బెదిరింపులకు టిఎంసి బెదిరేది లేదని ఆమె స్పష్టం చేశారు. స్థానికులను బిఎస్‌ఎఫ్ వేధిస్తే పోలీసు కేసులు నమోదు చేయాలని ఆమె కూచ్ బిహార్‌లోని మహిళలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 19న ఇక్కడ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్‌ఐఎ, ఆదాయం పన్ను శాఖ, బిఎస్‌ఎఫ్, సిఐఎస్‌ఎఫ్ వంటివన్నీ బిజెపి కోసం పనిచేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఒక దేశం, ఒకే పార్టీ అన్న సిద్ధాంతాన్ని బిజెపి పాటిస్తోందని ఆమె విమర్శించారు. లెక్కలేనన్ని కేసులు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా నియమించడం సిగ్గుచేటని ఆమె నివిత్ ప్రమాణిక్‌ను ప్రస్తావిస్తూ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News