Sunday, April 28, 2024

మొబైల్ ఫోన్ల దొంగ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మొబైల్ ఫోన్లు, బైక్‌లను చోరీ చేస్తున్న దొంగను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి తొమ్మిది మొబైల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.4లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని కాలాపత్తర్‌కు చెందిన అబ్దుల్ మజీద్ ఖాన్ అలియాస్ బాబర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు మొబైల్ ఫోన్లు, బైక్‌ల చోరీ చేయడంతో వివిధ పోలీస్ స్టేషన్లలో 20 కేసులు పోలీసులు నమోదు చేశారు. 2019లో పోలీసులు పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. బయటికి వచ్చిన తర్వాత ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించాడు.

ఈ నెలలో నారాయణగూడలోని విట్టల్‌వాడిలో పల్సర్ బైక్‌ను చోరీ చేశాడు, రెండు వారంలో హోండా షైన్ బైక్‌ను చోరీ చేశాడు. ఈ నెల 6వ తేదీన కామాటిపురలో మొబైల్ ఫోన్, 10వ తేదీన మలక్‌పేట, సితాఫల్‌మండి, ప్యారడైజ్‌లో ఈ నెల 16వ తేదీన, 17వ తేదీన మొఘల్‌పురలో, బేగంబజార్‌లో మొబైల్ ఫోన్లను చోరీ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కోసం అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి, ఎస్సైలు అశోక్ రెడ్డి, గగన్‌దీప్, నవీన్ తదితరలు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News