Sunday, May 5, 2024

చిక్కుకు పోయిన కార్మికుల మనోధైర్యం పెంచాలి: మోడీ

- Advertisement -
- Advertisement -

ఉత్తరకాశి : సిల్కియారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులకు మనోధైర్యం పెంచేలా సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామికి ప్రధాని మోడీ సూచించారు. కార్మికుల యోగక్షేమాలపై ఆరా తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారం ద్వారా అవసరమైన వనరులు, సహాయ పరికరాలు సమకూర్చడమౌతుందని చెప్పారు. ఈ విధంగా ముఖ్యమంత్రి ధామితో ప్రధాని మోడీ సొరంగ కార్మికుల క్షేమంపై మాట్లాడడం మూడోసారి. దీనిపై ముఖ్యమంత్రి ధామి సహాయ కార్యక్రమాల గురించి ప్రధాని మోడీకి వివరించారు. కార్మికులకు ఆక్సిజన్, పోషకాహారం అందించడమౌతోందని, వారంతా క్షేమంగానే ఉన్నారని వివరించారు. నిపుణుల సూచనలతో అన్ని సంస్థలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయని, సహాయ కార్యక్రమాలు నిరాఘాటంగా సాగేలా తాను పర్యవేక్షిస్తున్నానని ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు.

కార్మికులు క్షేమంగా బయటపడతారని “ఆరాల్డ్ డిక్స్‌” ఆశాభావం
సొరంగం వద్దకు నిన్ననే తాను వచ్చానని, నిన్న, ఈరోజు జరుగుతున్న పనులు చూస్తుంటే అసాధారణంగా ఉన్నాయని ఇంటర్నేషనల్ టన్నెలింగ్ నిపుణులు ఆర్నాల్డ్ డిక్స్ పేర్కొన్నారు. కార్మికులను బయటకు తీసుకురాడానికి సోమవారం రూపొందించిన ప్రణాళిక చాలా ఉత్తమంగా ఉందన్నారు. అయితే సహాయ కార్యక్రమాలు ఎప్పటికి పూర్తవుతాయో ఆయన చెప్పలేదు. కార్మికులంతా క్షేమంగా బయటపడతారన్న ఆశాభావం వెలిబుచ్చారు. కార్మికులతోపాటు వారిని తీసుకురాడానికి ప్రయత్నిస్తున్న సిబ్బంది క్షేమంగా ఉండాలన్నదే తమ లక్షమని తెలిపారు. సొరంగం వద్ద వైద్య బృందాలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) సిబ్బంది కూడా సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News