Saturday, May 4, 2024

మణిపూర్ సిఎంను వెంటనే బర్తరఫ్ చేయాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మణిపూర్‌లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా పరిగణిస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆ రాష్ట్ర సిఎంపై ఆగ్రహం వ్యక్తం చేయడం సరిపోదని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని పరిస్థితులతో పోల్చి తప్పుడు ఆరోపణలు చేయడానికి బదులుగా మణిపూర్ సిఎంను మోడీ పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

మణిపూర్ ఘటనపై ప్రధాని నేడు పార్లమెంట్‌లో ప్రకటన చేస్తారని దేశం మొత్తం ఎదురుచూస్తోందని, 80 రోజులుగా మణిపూర్ మండిపోతున్నా కేంద్ర ప్రభుత్వం నోరు విప్పకుండా పూర్తి నిస్సహాయతతో ఉండిపోయిందన్నారు. ఎలాంటి పశ్చాత్తాపం చెందలేదని, మోడీ నిజంగానే మణిపూర్ ఘటనపై బాధపడి ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై అసత్య ఆరోపణలు మాని బీరేన్ సింగ్‌ను డిస్మిస్ చేసి ఉండేవారని ఖర్గే ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News