Tuesday, April 30, 2024

ఆ విషయంలో ఒకే ఒక్కడు… మన్మోహన్ సింగ్!

- Advertisement -
- Advertisement -

ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక పరిస్థితిని కొత్త పుంతలు తొక్కించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దాదాపు 33 ఏళ్ల తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పదవీవిరమణ చేస్తున్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలతో దేశ భవిష్యత్ కొత్త మలుపు తిరిగింది. 2004 మే 22న ప్రధాని పదవి చేపట్టి పదేళ్లపాటు 21వ శతాబ్దిలో దేశాన్ని ముందుకు నడిపించిన విద్యావేత్త మన్మోహన్ సింగ్. బెస్ట్ పార్లమెంటేరియన్ గా ప్రశంసలు అందుకున్న మేధావి ఆయన.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ప్రధాని పదవిని చేపట్టిన మన్మోహన్, ఆ పదవిలో పదేళ్లు కొనసాగారు. 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్ చక్వాల్ లో జన్మించిన మన్మోహన్ సింగ్ 1958లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రం చదివి 1962లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ పూర్తి చేశారు. చండీగఢ్ పంజాబ్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లలో ప్రొఫెసర్ గా పనిచేశారు. 1976-80 మధ్య రిజర్వుబ్యాంక్ డైరెక్టర్ గా, 1982-1985 మధ్య ఆర్ బీఐ గవర్నర్ గా సేవలందించారు.

ఆసియా అభివృద్ధి బ్యాంక్ లోనూ గవర్నర్ హోదాలో పనిచేశారు. ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా, యూజీసీ చైర్మన్ గా, ప్రధాని ఆర్థిక సలహాదారుగా ఎన్నో బాధ్యతలు వహించారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నసమయంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్.. ఆర్థికరంగంలో తనకు గల అపార అనుభవాన్ని ఉపయోగించి, గొప్ప ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటికి దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకదశలో దేశ అవసరాలకు బంగారు నిల్వలు కుదువపెట్టే పరిస్థితికి దిగజారింది. అలాంటి సమయంలో, దేశాన్ని గట్టెక్కించిన మేధావి మన్మోహన్ సింగ్. ఆయన ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలవల్లే  ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది.

డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 మే2న దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 2014వరకూ కొనసాగారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత సుదీర్ఘ కాలంపాటు ప్రధానిగా ఉన్నది ఆయనే. మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్1 నుంచి 2024 ఏప్రిల్3 వరకూ 33 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఐదు పర్యాయాలు అసోం నుంచి, 15ఏళ్లపాటు రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఎన్నడూ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విశేషం.

డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఎన్నో పురస్కారాలు వరించాయి.1956లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆడమ్ స్మిత్ ప్రైజ్ అందుకున్నారు. 1987లో పద్మవిభూషణ్ పురస్కారం, 1993లో యూరో మనీ అవార్డు, ఉత్తమ ఆర్థిక మంత్రి అవార్డు, 1993,1994లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా ఆసియా నుంచి ఏషియా మనీ అవార్డు పొందారు. 2017లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News