Sunday, May 5, 2024

29న ఛలో పార్లమెంట్!

- Advertisement -
- Advertisement -

Balbir Sing Rajewal
రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రజేవాల్ ప్రకటన

సింఘు: “ మేము సేద్యపు చట్టాల ఉపసంహరణ, కనీస మద్దతు ధర, ప్రాణాలర్పించిన రైతులకు నష్టపరిహారం, రైతులపై పెట్టిన కేసులపై చర్చించాము. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) నిర్ణయించుకున్న కార్యక్రమాలు యథాప్రకారం జరుగుతాయి. అంటే,22న లక్నోలో కిసాన్ పంచాయత్, 26న సరిహద్దుల్లో సమావేశాలు, 29న ఛలో పార్లమెంట్ వంటివి కొనసాగుతాయి” అని రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రజేవాల్ సింఘు బార్డర్ వద్ద విలేకరులకు తెలిపారు.
అంతేకాక ఆయన మేము మా డిమాండ్లకు సంబంధించిన బహిరంగ లేఖ(ఓపెన్ లెటర్)ను ప్రధానికి రాయనున్నాము. అందులో ఎంఎస్‌పి కమిటీ, దాని హక్కులు, దాని టైమ్ ఫ్రేమ్, విధులు; విద్యుత్ బిల్లు 2020, కేసుల ఉపసంహరణ, లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై మంత్రి (అజయ్ మిశ్రా తేని)తొలగింపు గురించి రాయనున్నాము. మూడు సేద్యపు చట్టాల ఉపసంహరణపై ప్రధాని ప్రకటనను మేము స్వాగతిస్తున్నాము. అయినప్పటికీ ఇంకా అనేక విషయాలు పరిష్కరించాల్సి ఉందని బల్బీర్ సింగ్ రజేవాల్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News