Tuesday, April 30, 2024

చుడీబజార్ జంతు సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మేయర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగరంలోని అన్ని జంతు సంరక్షణ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడమౌలిక సదుపాయాలు, ఇతర వసతుల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. చార్మినార్ జోన్ లోని చుడీబజార్ జంతు సంరక్షణ కేంద్రాన్ని సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వీధి కుక్కల థియేటర్స్, రిహాబిలిటేషన్ సెంటర్, స్టెరిలైజ్‌డాగ్ సెంటర్ లను పరిశీలించారు.ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి మాట్లాడుతూ కుక్కలకు వేడి వేడి ఆహారాన్ని అందించారదని, అదేవిధంగా ఆహారం, తాగునీరును ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా నిర్ణీత సమయాల్లోనే ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇతర మున్సిపాలిటీల నుండి వలస వచ్చిన కుక్కలను వెంటనే స్టెరిలైజేషన్ కు చర్యలు తీసుకోవాలని సూచించారు. హెచ్‌ఎండిఏ పరిధిలో కూడా మరికొన్ని అనిమల్ కేర్ సెంటర్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నమన్నారు. వీధి కుక్కలకు అందిస్తున్న ఆహారం ఒకే గిన్నెలో వేయడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక నుండివాటికి సరిగా ఆహారం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులనుఆదేశించారు. తదనంతరం కుక్కల స్టెరిలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మేయర్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టెరిలైజ్ చేసిన కుక్కలను వి-షేప్ నాట్స్ ద్వారా గుర్తిస్తామని అధికారులు మేయర్ కు తెలిపారు. వీధి కుక్కలనుపట్టుకోవడానికి 10 వాహనాలను వినియోగిస్తున్నందున ఉదయం సమయంలో కూడా కుక్కలను పట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని మేయర్ అధికారులనుఆదేశించారు. ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని కుక్కలకు తాగునీటి వసతి కి చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఫిర్యాదులు అందితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. వీధి కుక్కలనుపట్టుకోవడానికి వినియోగించే స్టెరిలైజ్‌డాగ్ వాహనాలు తెల్లవారు జాము 5:30 గంటలకుక్షేత్రస్థాయిలో కుక్కలను పట్టుకోవడానికి వెళ్లాలని తెలిపారు. కుక్కలకు వండే కిచెన్ లో వండే ఆహారాన్ని పరిశీలించారు.

వాటికి అందిస్తున్న ఆహారాన్నిసరిపడా అందించాలని వెటర్నరీ అధికారులకు సూచించారు.ప్రతి రోజు రెండు షిఫ్ట్ లలో నిర్దేశించిన సర్జరీల కంటే ఎక్కువగా సర్జరీలు నిర్వహించాలని ప్రస్తుతం చేస్తున్న సర్జరీలు 42 నుండి45 ఉండగా వాటిని 60 నుండి 70 సర్జరీలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను మేయర్‌ఆదేశించారు. ప్రస్తుతం ఈ సెంటర్ లో 200 స్టెరిలైజ్‌డాగ్స్, 105 నాన్ స్టెరిలైజ్ డ్‌డాగ్స్ ఉన్నాయని అధికారులు మేయర్ కు వివరించగా వీటికి సకాలంలో సరైన ఆహారం అందించాలనిఅధికారులను ఆదేశించారు.అనంతరం నగర మేయర్ ఎనిమల్‌కేర్ సెంటర్ పక్కనే ఉన్న జిహెచ్‌ఎంసి ద్వారా నిర్వహిస్తున్న బి.టి మిక్సింగ్ ప్లాంట్ ను సందర్శించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ డా.అశోక్, వెటర్నరీ అధికారి డా.రాంచదర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News