Monday, April 29, 2024

Encounter: భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోల మృతి

- Advertisement -
- Advertisement -

చత్రా: జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో మావోయిస్టులు, భదత్రా బలగాల మధ్య సోమవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. లాలంగ్ పోలీస్‌స్టేషన్ ఏరియాలోని చత్రాపాలాము సరిహద్దులో ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 150కిలోమీటర్ల దూరంలో భద్రతా బలగాలు, మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, ఈ ఎన్‌కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందగా మావోలకి బుల్లెట్ గాయాలు అయ్యాయన్నారు. మృతిచెందిన మావోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్‌పి రంజన్ తెలిపారు.

సంఘటన ప్రాంతంలో మావోలకు చెందిన భారీ ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి వెల్లడించారు. ఎస్‌డిపిఒ అశోక్ ప్రియదర్శి గన్‌ఫైట్ సోమవారం ఉదయం 8.30కి ప్రారంభమైందని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు. రెండు ఎకె47 రైఫిల్స్, రెండు దేశీ తయారీ రైఫిల్స్ సీజ్ చేసినట్లు వివరించారు. మావోయిస్టు స్పెషల్ ఏరియా కమిటీ ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు భావిస్తున్నామన్నారు. వివరాలను నిర్ధారించుకోవాలన్నారు. పాశ్వాన్‌పై రూ.25లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్‌డిపిఒ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News