Saturday, May 4, 2024

ఎంసీఏ విద్యార్థిని దారుణ హత్య.

- Advertisement -
- Advertisement -

తన ప్రేమను నిరాకరించిందని నేహా హీరే మఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు దారుణంగా హత్య చేసిన సంఘటనపై కర్ణాటకలో అనేక చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హుబ్బళ్లిలో బాధిత కుటుంబాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పరామర్శించారు. విద్యార్థిని తండ్రి హుబ్బళ్లిధార్వాడ్ మున్సిపాలిటీ పరిధి లోని కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హీరేమఠ ఇంటికి నడ్డా వెళ్లి ఆ దంపతులకు ధైర్యం చెప్పారు. ఈ సంఘటన పై ముఖ్యమంత్రి సిద్ద రామయ్య చేసిన ప్రకటనలు దర్యాప్తును నీరు కార్చేలా ఉన్నాయని విమర్శించారు.

రాష్ట్ర పోలీస్‌లు దర్యాప్తు సరిగా చేయలేకుంటే ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. మరో వైపు నేహా హత్య సంఘటనను పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థిని హత్యకు నిరసనగా ఏప్రిల్ 22 (సోమవారం) న స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ముస్లిం వర్గానికి చెందిన వ్యాపారులంతా సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు బంద్ పాటిస్తారని అంజుమన్ ఇ ఇస్లామ్ అధ్యక్షుడు ఇస్మాయిల్ టమట్గర్ వెల్లడించారు. ఏప్రిల్ 18న హుబ్బళ్లి లోని బీవీబీ కాలేజీ క్యాంపస్‌లో హుబ్బళ్లి పాలికె కార్పొరేటర్ నిరంజన్ హీరేమఠ కుమార్తె నేహా (23)ను ఫయాజ్ అనే యువకుడు కత్తితో పొడిచి చంపిన సంఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News