Saturday, April 27, 2024

వలస కూలీలపై వైద్యశాఖ అధికారులు ఆరా

- Advertisement -
- Advertisement -

Medical officer inquired about migrant workers

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వైద్యశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత ఆరునెలల నుంచి రోగులకు సేవలందిస్తున్న వైరస్ విశ్వరూపం దాల్చి ప్రజలను ప్రాణాలతో చెలగాటమాడుతుంది. మార్చి 2న దుబాయ్ నుంచి వచ్చిన సాప్ట్‌వేర్ ఇంజనీర్‌తో మొదలైన పాజిటివ్ కేసులు సంఖ్య, డిల్లీ మర్కజ్ బాధితులతో రెండు అంకెల పెరిగింది. తరువాత మహారాష్ట్ర, రాజస్దాన్‌లకు వెళ్లిన కార్మికులు తిరిగి స్వస్దలాలకు రావడంతో కరోనా కేసులు వందల్లో పెరిగిపోయింది. అదే పరంపర జూన్‌వరకు సాగడంతో నగరంలో ఉంటే కరోనా వైరస్ భారినపడుతామని గ్రామాల నుంచి ఉపాధి కోసం వచ్చిన లక్షలాది కూలీలు తిరిగి పల్లెబాట పట్టారు. దీంతో నగరంలో వైరస్ తగ్గుముఖం పట్టి 147కు చేరింది. వెంటనే అధికారులు ఆగస్టు నెలావరకు మహమ్మారి అదుపులో ఉంటుందని భావించారు.

కానీ గ్రామాలకు వెళ్లిన కూలీలకు అక్కడ ఉపాధి లభించకపోవడంతో మళ్లీ భవన నిర్మాణాల్లో పనిచేసేందుకు పట్టణానికి చేరుకుంటున్నారు. వీరి రాకతో తగ్గుముఖం పడుతున్న కరోనా మళ్లీ విజృంభిస్తుంది. సెప్టెంబర్ మొదటి వారం పాజిటివ్ కేసులు సంఖ్య 350కి పైగా నమోదైతున్నాయి. దీనికి తోడు నగరంలో వ్యాపార సముదాయాలు కార్యకలపాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుండటంతో జనం ఇష్టానుసారంగా తిరగడంతో వైరస్ రెక్కలు కట్టుకుందని జిల్లా వైద్యశాఖ పేర్కొంటున్నారు. ఉపాధి కోసం ఒకే దగ్గర గుంపులుగా చేరి, ముఖానికి మాస్కులు, చేతులకు శానిటైజర్ ఉపయోగించకపోవడంతో ఒకరి నుంచి ఒకరికి సోకి కరోనా విశ్వరూపం దాల్చుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు గ్రేటర్ నగరంలో 2లక్షల మందికి టెస్టులు నిర్వహించగా, 54,590మందికి వైరస్ ఉన్నట్లు నిర్దారించారు. అందులో 740మంది మృత్యువాత పడినట్లు అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నారు.

నగరానికి వచ్చే వలసకూలీలను గుర్తించి,అందరికి పరీక్షలు చేస్తే వైరస్ విస్తరించకుండా చేయవచ్చని వైద్యశాఖ భావిస్తుంది. అందుకోసం స్దానిక వైద్యశాఖ అధికారులు ఆశవర్కర్లు, అంగన్‌వాడీ, ఎఎన్‌ఎంలు సహాయంతో వారి గుర్తించి, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో టెస్టులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్తీలు,కాలనీల్లో ఇంటింటికి తిరిగి ఇటీవలే గ్రామాల నుంచి వచ్చిన వారి వివరాలు స్దానికులు ద్వారా తెలుసుకునే పనిలో పడ్డారు. గ్రేటర్ నగరంలో గత 15రోజుల నుంచి సుమారుగా 3లక్షలమంది భవననిర్మాణ పనులకు సంబంధించిన కూలీలు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ చివరివరకు వారందరు కరోనా పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించడంతో పాటు, లక్షణాలు కనిపించిన వారి వెంటనే ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు ఆరోగ్య కార్యకర్తలను సిద్దం చేస్తున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. నగర ప్రజలు వైద్యులు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటించి ఇతరులకు సోకకుండా చూడాలని కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News