Friday, May 3, 2024

టొరంటో మాస్టర్స్ విజేత మెద్వెదేవ్

- Advertisement -
- Advertisement -

Medvedev, winner of the Toronto Masters

 

టొరంటో: ప్రతిష్టాత్మకమైన టొరంటో మాస్టర్స్ ఎటిపి టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యా స్టార్ డానిల్ మెద్వెదేవ్ టైటిల్‌ను సాధించాడు. ఫైనల్లో అమెరికా ఆటగాడు రిల్లీ ఒపెల్కాను ఓడించాడు. ఏక పక్షంగా సాగిన పోరులో డానిల్ 64, 63తో విజయం సాధించాడు. ఆరంభం నుంచే డానిల్ ఆధిపత్యం చెలాయించాడు. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకు పడ్డాడు. అతనికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాడు. మరోవైపు ఒపెల్కా కూడా తొలి సెట్‌లో కాస్త గట్టిగానే పోరాడాడు. కానీ డానిల్ ధాటికి ఎదురు నిలువడంలో విఫలమయ్యాడు. తన మార్క్ షాట్లతో విరుచుకుపడిన టాప్ సీడ్ డానిల్ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యాడు. డానిల్ ధాటికి తీవ్ర ఒత్తిడికి గురైన ఒపెల్కా వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన డానిల్ 64తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. తర్వాతి సెట్‌లో మెద్వెదేవ్ మరింత దూకుడును ప్రదర్శించాడు. ప్రత్యర్థిపై ఆరంభం నుంచే ఒత్తిడి పెంచుతూ ముందుకు సాగాడు. ఇక ఒపెల్కా ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమై ఓటమి పాలయ్యాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News