Monday, August 11, 2025

మెగా హీరోల సందడి

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్ ముగ్గురూ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిమ్‌లో వ్యాయామం అనంతరం ఈ మెగా హీరోలు ముగ్గురూ కలిసి దిగిన ఫోటోను వరుణ్ తేజ్ తన ఇన్ స్టా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ ఫోటోలో ముగ్గురు మెగా హీరోలు ఓకే ప్రేమ్ లో కనిపించడం నేపథ్యంలో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ తో పాటు, రామ్ చరణ్, సాయి దుర్గ తేజ్ ముగ్గురు కూడా జిమ్ లో పెద్ద ఎత్తున చెమటలు చిందిస్తున్నారు. ఇలా వర్కౌట్స్ అనంతరం ఈ ముగ్గురు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోకు వీకెండ్‌లో సరదాగా..’ అంటూ వరుణ్ తేజ్ క్యాప్షన్ ఇవ్వగా.. దీన్ని చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News