Friday, April 26, 2024

జూన్ 1నుంచి పట్టాలెక్కనున్న మెట్రో రైలు..

- Advertisement -
- Advertisement -

Metro Rail will be start from June 1 in Hyderabad

జూన్ 1నుంచి ప్రయాణికులకు అందనున్న సేవలు
లాక్‌డౌన్ మార్గదర్శకాలు పాటించేలా చర్యలు
రైలెక్కే ముందు థర్మల్ స్క్రీనింగ్, ముఖానికి మాస్కులు తప్పనిసరి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి రాగానే నడిపిస్తామంటున్న అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విజృంభణతో ప్రభుత్వం వైరస్ కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధించింది. దీంతో నగరంలో రోజుకు లక్షలాదిమంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేసే మెట్రోరైల్ కూత మార్చి 22నుంచి ఆగిపోయింది. గత రెండు నెలలుగా మెట్రోస్టేషన్లు బోసిపోయి నిర్మానుష్యంగా మారాయి. సర్కార్ విధించిన లాక్‌డౌన్‌కు తాము సహకరిస్తామని మెట్రో ప్రకటించి రైల్ సేవలను నిలిపివేశారు. ఇటీవల ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇస్తూ అరెంజ్, గ్రీన్ జోన్లలో పూర్తి స్దాయిలో కార్యకలపాలు చేసుకోవచ్చని ప్రకటన చేయడంతో గ్రేటర్ మినహా మిగతా జిల్లాలో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి.

రాజధాని నగరంలో ఇప్పటికే మధ్యం, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ప్రారంభం కావడంతో పనిచేసే ఉద్యోగులకు రవాణా ఇబ్బందులు రావడంతో జూన్ 1వ తేదీనుంచి బస్సులతో పాటు మెట్రో రైల్‌ను పట్టాలపై పరుగులు పెట్టించేందుకు అధికారులు సిద్దమైతున్నట్లు పేర్కొంటున్నారు. ప్రారంభంలో మెట్రో రోజుకు 1.50లక్షల మంది ప్రయాణించగా, ఆర్టీసీ సమ్మె కాలంలో ఏకంగా మెట్రో ప్రయాణికుల సంఖ్య 4.60లక్షలకు చేరింది. అప్పటి నుంచి మెట్రో లాబాల బాటలో ముందుకు వెళ్లుతుంది. ఊహించని విధంగా కరోనా మహమ్మారి విశ్వరూపం దాల్చడంతో మెట్రో ఆశలపై నీరుగారాయి. మూడు కారిడార్ల పరిధిలో 10నిమిషాలకు ఒక సర్వీసు నడుపుతూ రోజుకు రూ. కోటి ఆదాయం, మెట్రో మాల్స్ ద్వారా నెలకు రూ.10కోట్లు సమకూర్చుకుంది. టికెట్స్, మాల్స్ నుంచి నెలకు ఎల్‌అండ్‌టికి రూ.40కోట్లు వచ్చేది. ఉరుములేని పిడుగులా వచ్చిన లాక్‌డౌన్ దెబ్బకు మెట్రో ఢీలా పడింది.

ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి మెట్రో రైలు పట్టాలెక్కేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మెట్రో పునరుద్దరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి రావాల్సి ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. పరిమిత సంఖ్యలో రైళ్లను పట్టాలపై తీసుకొచ్చి గంటకు ఒక రైలు చొప్పన నడిపించి, మరో నెల రోజుల తరువాత 30నిమిషాలకో రైళ్లు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రయాణికులు నిలబడకుండా, వారు సూచించిన సీట్లలో కూర్చునే విధంగా ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా ఏసీలను సగం వరకు తగ్గించి ప్రకృతి ప్రసాదించే గాలిని పీల్చుకునే విధంగా చేస్తున్నారు. ప్లాట్‌పామ్‌పైకి రైల్ వచ్చే ముందు పూర్తిగా బోగీలు శానిటైజర్ చేసి, ప్రయాణికులు రైలెక్కే ముందు థర్మల్ స్క్రీనింగ్ చేసి, ముఖానికి మాస్కులు ధరించేలా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

Metro Rail will be start from June 1 in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News