Sunday, May 5, 2024

దక్షిణ మధ్య రైల్వే సహకారంతో శిశువులకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గది

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారం నెం.1 వద్ద పోచంపల్లి చేనేత విక్రయ కేంద్రం
రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్నాం
డివిజినల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా

మనతెలంగాణ/హైదరాబాద్:  దక్షిణ మధ్య రైల్వే సహకారంతో శిశువులకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గదిని రోటరీ క్లబ్ ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వే సహకారంతో హైదరాబాద్ ఈస్ట్ రోటరీ క్లబ్, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 వారిచే శిశువుకు పాలివ్వడానికి తల్లులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిని మంగళవారం సికింద్రాబాద్ డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ 3150 ఎన్.వి.హనుమంత్ రావు, దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షురాలు శ్రీమతి చావి గుప్తా, రైల్వే ఉన్నతాధికారులు, రోటరీ సభ్యులు పాల్గొన్నారు.

దక్షిణ మధ్య రైల్వేలో ప్రధానమైన రైల్వే కేంద్రం రద్దీ రైల్వే స్టేషన్ అయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారం నెం.10 వద్ద ఈ ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ఈ గది చుట్టూ అమర్చిన క్యూబికల్స్ సెట్ రైలు ప్రయాణం చేసే తల్లులకు వారి శిశువుకు పాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారం నెం.1 వద్ద పోచంపల్లి చేనేత విక్రయ కేంద్రం ఏర్పాటు చేయబడింది. దీంతో స్థానికంగా రూపొందించిన పోచంపల్లి వస్త్రాలు కొనుగోలు చేయడంలో రైలు ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. అంతేకాక చిన్న పరిశ్రమ వ్యాపారస్తులకు వారి వ్యాపార అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది.

రైలు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో

ఈ సందర్భంగా సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ రైలు ప్రయాణికులకు వసతులు సౌకర్యాలు కల్పించడంలో రైల్వే ఎప్పుడూ ముందంజలో ఉంటుందని, ఇందులో భాగంగానే తల్లులు శిశువుకు పాలిచ్చేందుకు గదిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీన్ని ఏర్పాటు చేయడంలో సహకరించిన రోటరీ క్లబ్ వారిని ఆయన అభినందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన చేనేత విక్రయ కేంద్రంతో వ్యాపారులతో పాటు రైలు ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎ.కె.గుప్తా అన్నారు.

ప్రయాణికుల సౌకర్యాలో తల్లి, శిశువు సంరక్షణ ప్రధానమైంది. రైలు ద్వారా ప్రయాణించే శిశువులు తల్లులకు ఉపయోగపడేలా రోటరీ క్లబ్ వారి సహకారంతో హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ డివిజన్లలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో మరిన్ని కియోస్క్/క్యూబికల్స్ ఏర్పాటుకు రైల్వే ప్రణాళిలకు రూపొందిస్తోంది. గతంలో 2019లో పైట్ ప్రాజెక్టుగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 వారిచే బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో శిశువుకు తల్లి పాటు ఇవ్వడానికి మొదటి సారిగా ప్రత్యేక గది ఏర్పాటు చేయడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News