Tuesday, April 30, 2024

ఏప్రిల్ 22 నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ: ఈటెల రాజేందర్

- Advertisement -
- Advertisement -

Etela Rajender

 

హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 18 కొత్త కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల వెల్లడించారు. ఈ రోజు 665 శాంపిల్స్ లో 18 మందికి పాజిటీవ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 471కి చేరింది. ఒకరికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నాం. మరొకరు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 12కు చేరింది. ప్రస్తుతం 414 మందికి గాంధీలో చికిత్స అందిస్తున్నాం. రేపు 70 మంది డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 45 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏప్రిల్ 22 నాటికి కరోనా బాధితులు పూర్తిగా డిశ్చార్జ్ అవుతారు. ఢిల్లీ మర్కజ్ కేసులు లేకుంటే ఇప్పటికే కరోనా ఫ్రీ తెలంగాణగా ఉండేది. గాంధీలో కేవలం కరోనా పాజిటీవ్ ఉన్న వారికే చికిత్స అందిస్తున్నాం. ఓపి కోసం కింగ్ కోఠి ఆస్పత్రికి వెళ్లండి. రేపటి నుంచి కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. కేసులు తగ్గినా ప్రజలు బయటికి రావొద్దు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందిస్తాం. తెలంగాణ 101 హాట్ స్పాట్ ప్రాంతాలను గుర్తించాం. హాట్ స్పాట్ ప్రాంతాల్లో రాకపోకలు బంద్. తలసేమియా వ్యాధిగ్రస్తులకు నెలకు రెండుసార్లు రక్తమార్పిడి చేయాలి. రక్త దానం చేసేందుకు ముందుకు రావాలని.. రక్తం దానం చేసేందుకు ముందుకొస్తే అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి ఈటెల తెలిపారు.

Minister Etela Rajender speaks with Media on Covid-19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News