Wednesday, May 1, 2024

సోషల్ మీడియా వార్తలు నమొద్దు.. త్వరలో టిమ్స్ ప్రారంభం: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః త్వరలోనే టిమ్స్‌ను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిని మంత్రి ఈటల పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాటాడుతూ.. ‘టిమ్స్ ఆసుత్రిలో అన్ని సౌకరాలు కల్పించాం. టిమ్స్‌లో 1000 బెడ్లకు పూరిస్థాయిలో ఆక్సిజన్ కల్పిస్తున్నాం. 50 బెడ్లకు వెంటిలేటర్ సౌకర్యం కల్పించాం. రెండు మూడు రోజుల్లో టిమ్స్‌నను ప్రారంభిస్తాం. ఆరోగ్యరంగంలో కేరళతో పోటీపడుతున్నాం. ప్రజారోగ్యం విషయంలో రాజీపడబోం. ఆరోగ్య విషయంలో కొన్ని వేల కోట్లు ఖర్చు చేశాం. ప్రభుత్వ వైద్యంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిపై దుష్ప్రచారం తగదు. వైద్యుల మనోభావాలను ఎవరూ కించపరిచేలా వ్యాఖ్యలు చేయొద్దు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు సరికాదు.

గాంధీలో పనిచేసే సిబ్బందిని అవమానించేలా మాట్లాడుతున్నారు. బాధ్యతలేని వాళ్లు రకరకాలుగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికే వాళ్ల వ్యాఖలు. ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు సేవలు చేస్తున్నారు. కరోనా రోగులకు గాంధీలో గొప్పగా సేవలు చేస్తున్నారు. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ తూ.చ తప్పకుండా పాటిస్తున్నాం. లక్షణాలు లేనివారు పరీక్షల కోసం రావొద్దు. దీనివల్ల కరోనా పేషెంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లక్షణాలు ఉన్నావారు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలి. మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాం.. ఊరికే కరోనా పరీక్షలు చేసుకోవద్దు. ప్రవేటు ల్యాబ్స్‌కు కూడా ఇదే స్పష్టం చేశాం. హోం ఐసోలేషన్ కుదరకపోతే ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఐసోలేషన్‌లో ఉంచుతాం. జిల్లా స్థాయిలో ఏరియా ఆసుపత్రుల్లో ఐసీయూలు ఏర్పాటు చేశాం’ అని మంత్రి ఈటల పేర్కొన్నారు.

Minister Etela Rajender visits Gachibowli TIMS Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News