Sunday, April 28, 2024

రైతులను అణిచివేసేందుకు కేంద్రం కుట్ర: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao comments on Central Agriculture Bill

చిన్నకోడూరు: కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకువచ్చి కార్పొరేట్‌లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరుహరీశ్‌రావు అన్నారు. గురువారం చిన్నకోడూరు మండలంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధకృష్ణ శర్మతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులో చేపల పిల్లలను వదిలి అనంతరం మండల పరిధిలోని గంగాపూర్ గ్రామంలో గొర్రెలు,మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. అనంతరం మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాధీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేస్తున్నట్టు మండల ఉపాధ్యక్షుడు కీసర పాపయ్య ప్రకటించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీలో ఐదు రాష్ట్రాల నుంచి 99వేల ట్రాక్టర్లతో వచ్చి సమ్మె చేస్తున్న రైతులను అణచివేసుందుకు కేంద్ర ప్రయత్నం చేసిందని ఇందులో భాగంగానే 5మంది రైతులు చనిపోయారని అన్నారు. రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు పూర్తి మద్దతుగా ఉంటామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంట్‌తో పాటు ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తోందని తెలిపారు. అనంతరం మండల అభివృద్ధిపై సమీక్షిస్తూ.. గ్రామాల్లో మహిళా భవనం పెండింగ్‌లో ఉండవద్దని, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. విత్తనోత్పత్తికి మొక్కజొన్న, వరి, సన్‌ప్లవర్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. సీడ్ డెవెలప్ మెంట కోసం రైతులు ముందుకు వచ్చేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం తో పనిచేసి అభివృద్ధిపనులు వేగవంతం చేయాలనిసూచించారు. అనంతరం చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు, మర్రిచెట్టు నుంచి అల్లీపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 1286 లక్షలతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని డీఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ డీఈని మంత్రి ఆధేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News