Sunday, May 12, 2024

రేపే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు

- Advertisement -
- Advertisement -

GHMC Election results 2020 tomorrow

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి.దీంతో సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ఏర్పాటు చేశారు. ఒక హాల్ లో 14 టేబుల్స్, ప్రతి టేబుక్ కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్ నియమించారు. కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు సిసి టివిలు ఏర్పాటు. ఫస్ట్ రౌండ్ కి 14,000 వేల ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో మాస్కు, శానిటైజర్ తప్పనిసరి. ప్రతి టేబుల్ దగ్గర సిసి కెమెరాలు అమర్చారు. బ్యాలెట్ లెక్కించే ముందే పోస్టల్ బ్యాలెట్ లెక్కించే అవకాశముంది. మొదట మెహిదీపట్నం, చివరగా మైలార్ దేవ్ పల్లి డివిజన్ల ఫలితాలు వెల్లడికానున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News