Saturday, May 4, 2024

సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల నిజం చేశాం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల అయినా రైలు రావాలన్న కలను నిజం చేసి చూపించామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ శివారులో గల రైల్వే స్టేషన్‌లో ఆయన రైలు ట్రయల్ రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకులు సిద్దిపేటకు రైలు తీసుకువస్తామని నినాదంగా పెట్టుకున్నారే తప్ప రైలును తీసుకురాలేదన్నారు. అదే సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో సిద్దిపేటకు రైలును తీసుకువచ్చి ప్రజల కలను నెరవేర్చారన్నారు. బిఆర్‌ఎస్ సర్కార్ చేసిన ప్రతి వాగ్దానాన్ని చేతుల్లో చేసి చూపిస్తుందన్నారు. అతి త్వరలోనే సిద్దిపేట నుంచి రైల్వే సర్వీసులను ప్రారంభించుకోబోతున్నామన్నారు.

సిద్దిపేట జిల్లా కలను సాకారం చేసుకోవడంతో పాటు మరోవైపు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు తీసుకువచ్చామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి ఒక్కటిని దశల వారీగా ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. సిద్దిపేట అంటేనే అభివృద్ధికి మారుపేరు అన్నారు. ఈ ప్రాంతానికి రైలు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. అంతకు ముందు మంత్రి అభిమానులతో సెల్ఫీ దిగుతూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవీందర్ రెడ్డి, పాల సాయిరాం, వంగ తిరుమల్ రెడ్డి, నాయిని చంద్రం, మిద్దె రవి,నర్సింలు, యాదగిరి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News