Tuesday, April 30, 2024

బండి సంజయ్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. దేశంలోనే అత్యంత ఎత్తులో 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించుకున్న సందర్భంగా బండి సంజయ్ చేసిన విమర్శలు అర్థరహితమని అన్నారు. బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ జీర్జించుకోలేక పోతున్నాడని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నాడని పేర్కొన్నారు. పేపర్ లీకేజి ఘటనలో పట్టపగలు పట్టు బడిన దొంగ బండి సంజయ్ అని ధ్వజమెత్తారు.

దళితుల జనోద్ధారణ కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ని విమర్శించే నైతిక అర్హత బండి సంజయ్‌కు లేదని కొప్పుల అన్నారు. తెలంగాణ సచివాలయ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు విమర్శలు చేస్తున్నారా. లేక నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నందుకు విమర్శలు చేస్తున్నారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కెసిఆర్‌పై, తెలంగాణ సర్కార్‌పై చేసిన విమర్శలకు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు. లేనట్లైతే ప్రజలే తగిన రీతిలో సమాధానం చెబుతారని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News