Sunday, April 28, 2024

కాంగ్రెస్‌కు ఓటేస్తే 50 ఏళ్లు వెనక్కి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నాయకులకు ఎద్దు, ఎవుసం తెలియదు

వారికి పబ్బులు, క్లబ్బులే తెలుసు కోదాడ రోడ్ షోలో
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/కోదాడ: ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావొద్దు.. కోదాడలో ఎంఎల్ ఎ బొల్లం మల్లయ్య ఓటు భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 3న కోదాడలో బిఆర్‌ఎస్ జెండా ఎగరవేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 11సార్లు అధికా రం ఇస్తే 55ఏళ్లు రాష్ట్రాన్ని చావగొట్టారని కెటిఆర్ మండిపడ్డారు. ఆ పార్టీకి మరోసారి అవకాశమిస్తే మళ్లీ 50 ఏళ్లు వెనక్కి పోతామని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ప్రజలెవరూ ఆగం కా వొద్దని అందరం ఒక్కటై కాంగ్రెస్ గద్దల నుంచి తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చా రు.

తెలంగాణ అభివృద్ధితో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మరోసారి కెసిఆర్‌ని గెలిపించాలని ఓటర్లకు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. అ ప్పుడు కోదాడ ఎలా ఉండే.. ఇప్పుడు కోదాడ ఎలా ఉందని ఆలోచన చేయండని కోరారు. 24గంటల కరెంటు కావాలా.. ? 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పాలన కావాలా అని ప్రశ్నించారు. ఎలక్షన్ రాగానే వాళ్ళు వీళ్ళు చెప్పేది నమ్మొద్దని, మనస్పూర్తిగా ఆలోచన చేసి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్‌కి ఓటు వేయండని అభ్యర్థించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటలు పొలాలకు కరెంటు చాలని చెబుతున్నాడని మరి మూడు గంటలు కరెంటుతో సరిపోతుందో.. లేదో చెప్పాల్సింది ప్రజలేనన్నారు.

కరెంటు కావాలో.. కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలన్నారు. మళ్లీ బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే పింఛన్ రూ. 5 వేలకు పెంచుతామన్నారు. సౌభాగ్యలక్ష్మీ పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.3 వేలు అందించనున్నట్లు తెలిపారు. కోదాడలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆయన అభ్యరించినటువంటి కోదాడ పట్టణంలో రెండు పెద్ద చెరువులను మినీ ట్యాంక్ బండ్‌గా ఏర్పాటు చేస్తామన్నారు. రెండు రాజధానుల మధ్యలో ఉన్న కోదాడ హైటెక్ బస్టాండ్ ఏర్పాటు చేస్తామన్నారు. కోదాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నర్సింగ్ కాలేజీలో ఏర్పాటుచేస్తాం.. కోదాడ పట్టణ అభివృద్ధికి వంద కోట్ల రూపాయల కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News