Thursday, May 2, 2024

భవిష్యత్ తరాలకు కానుకగా గ్రీనరీ

- Advertisement -
- Advertisement -

Minister KTR check HMDA nursery

 

తెలంగాణలో హరితహారంను విజయవంతం చేద్దాం
సిఎం ఆదేశాల మేరకు ఈసారి పట్టణాలపై ప్రత్యేక దృషి
నాటే ప్రతి మొక్క కాపాడే లక్ష్యంగా పనిచేయాలి
నర్సరీల నుంచి ప్రజలకు ఉచితంగా మొక్కల పంపిణి
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ నుంచి ఉధృతంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టనున్నదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇందులో భాగంగా అన్ని పురపాలికల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తగు చర్యలను పురపాలక శాఖ తరపున తీ సుకుంటున్నట్లు అయన తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు అన్ని కార్పోరేషన్లు, మున్సిపాలీటీల్లో ఈసారి మరింత చోరవతో హరిత హారం కార్యక్రమాన్ని అమలు చేయనునన్నట్లు తెలిపారు. పట్టణాల్లో నాటే ప్రతి మొ క్కను కాపాడేందుకు ప్రయత్నం చేస్తామని ఈ సం దర్భంగా ఆయన తెలిపారు. పట్టణాలన్నింటీని హ రిత పట్టణాలుగా మార్చేందుకు ప్రజాప్రతినిధు లు, అధికారులు పాటుపడాలన్నారు. ముఖ్యంగా పురపాలక పట్టణాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచడం పైన ఇప్పటికే శాఖ తరఫున ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామన్నారు.

ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన భవిష్యత్ తరాలకి గ్రీనరీని కానుకగా అందించే లక్ష్యంతో ముందుకు పోదామని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు.బుధవారం శంషాబాద్‌లోని హెచ్‌ఎండిఎ నర్సరీని మంత్రి కెటిఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండిఎ ఆధ్వర్యంలో అక్కడ కొ నసాగుతున్న మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. నర్సరీలో మొక్కలు పెంచుతున్న తీరు, ఏ మొక్క లు అందుబాటులో ఉన్నాయి? వాటిని ప్రజలకు అందించే ప్రక్రియ వంటి పలు అంశాలపైన అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నా రు.

ఇప్పటికే పలు పట్టణాలకు మొక్కలను తమ నర్సరీల నుంచి హెచ్‌ఎండిఎ సరఫరా చేస్తున్నదని మంత్రి కెటిఆర్‌కు అధికారులు వివరించారు. నర్సరీలో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి కెటిఆర్ నర్సరీలో పనిచేసే అర్హులైనవారందరికీ ఇపిఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించే ఈ అంశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిధిలో ఎవరికైనా మొక్కల కావాల్సి వస్తే నగర పరిధిలో ఉన్న నర్సరీలలో నుంచి ఉచితంగా తీసుకునే అవకాశం ఉన్నదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News