Monday, April 29, 2024

‘నేను అలా అనలేదు’: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Clarification on GHMC Elections 2020

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల తేదీలపై తాను వ్యాఖ్యలు చేయలేదని, తాను అనని మాటలను తాను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయని అందులో నిజం లేదని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ”నవంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయని నేను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. జిహెచ్ఎంసి యాక్ట్ ప్రకారం నవంబర్ రెండవ వారం తరువాత ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కనుక పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగింది”అని చెప్పారు. ”ఎన్నికల షెడ్యూల్ మరియు నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమీషన్ పరిధిలోని అంశం. సదరు మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగింది”అని కెటిఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ బుధవారం ట్వీట్లు చేశారు.

Minister KTR Clarification on GHMC Elections 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News