Monday, April 29, 2024

టి-ఫైబర్ గ్రిడ్‌తో డిజిటల్ విప్లవం

- Advertisement -
- Advertisement -

Minister KTR Review meeting on T-Fiber project

త్వరలో రైతు వేదికలను టి.ఫైబర్‌తో అనుసంధానం
ప్రస్తుత ఐటి నెట్‌వర్క్, స్టేట్ డేటా సెంటర్‌ను కూడా టి..ఫైబర్ కిందకు తీసుకురావాలని ఆదేశం
దీని ద్వారా పౌర సేవల్లోనూ గణనీయమైన మార్పులు
సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని కెటిఆర్ ఆదేశం

ప్రాజెక్టు పురోగతిపై కెటిఆర్ సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌తో రాష్ట్రానికి బలమైన డిజిటల్ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రస్తుతం కరోనాపై జరుగుతున్న యుద్ధంలో డిజిటల్ మౌలిక వసతులు ప్రభుత్వానికి ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై మంగళవారం నాడిక్కడ మంత్రి కెటిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలమైన డి జిటల్ నెట్వర్క్ అవసరాన్ని ప్రస్తుత కరోనా సం క్షోభం నిరూపించిందన్నారు. ప్రస్తుతం ఉన్న ఆన్ లై న్ ఎడ్యుకేషన్, ఆన్‌లైన్ హెల్త్ కేర్, ఇ..కామర్స్ సేవల వంటి అవసరాల నేపథ్యంలో ప్రతి ఒక్క రా ష్ట్రం లేదా దేశం బలమైన డిజిటల్ నెట్‌వర్క్‌లను కలిగి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో లక్షలాది మంది ఉద్యోగులు వర్క్ ఫ్రొం హోమ్ అవకాశాన్ని వినియోగించుకుని పని చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. ఐటి, దాని అనుబంధ రంగాల్లో ఈ పరిస్థితి భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ఎలాంటి ఇబ్బందులు లేని బలమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అవసరమన్నారు. ఈ నేపథ్యంలో బలమైన డిజిటల్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేస్తూ దేశంలోనే తొలిసారిగా అందరికీ ఇంటర్నెట్ అందుబాటు ఉండాలన్న సమున్నతమైన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన టి…ఫై బర్ గ్రిడ్ ప్రాజెక్టు అవసరం, ఆవశ్యకత ప్రస్తుత పరిస్థితుల్లో మరింతగా పెరిగిందని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం(G2G), ప్రభుత్వం నుంచి పౌరులకు (G2C)వరకు అందించే సేవల్లో గణనీయమైన మార్పులు వస్తాయన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను ప్రపంచంతో కనెక్ట్ చేసే తీరుగా ఈ ప్రాజెక్టు ఉండబోతుందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు. ఇంతటి మార్పు తేగలిగిన శక్తి టి…ఫైబర్‌కు ఉందని అన్నారు. ఇదిలా ఉండగా త్వరలో రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న రైతు వేదికలన్నింటిని కనెక్ట్ చేయాలని టి…ఫైబర్ బృందానికి ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న డిజిటల్ నెట్‌వర్క్ యొక్క స్థితిగతులుపైన కూడా సమీక్షించిన మంత్రి కెటిఆర్….ప్రస్తుతం అందుబాటులో ఉన్న పూర్తి డిజిటల్ నెట్‌వర్క్, స్టేట్ డాటా సెంటర్‌లను టి..ఫైబర్ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.

టి..ఫైబర్ ప్రాజెక్టు పరిధిని మరింత విస్తరించి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆయనఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఇందుకోసం అవసరమైతే రైట్ టూ వే చట్ట సదుపాయాన్ని కల్పించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ప్రస్తు తం ఉన్న పనులన్నింటినీ రానున్న పది నెలల్లో పూర్తిచేసే దిశగా కసరత్తు చేయాలని సూచించారు. ఈసమీక్ష సమావేశంలో ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరితో పాటు టి..ఫైబర్ ఎండి సుజయ్ కారంపూరి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News