Saturday, September 21, 2024

కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించనున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR to launch Command Control Centerహైదరాబాద్: సేఫ్ అండ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అత్యాధునికంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, డిజిపి మహేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో దీనిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో ఉన్న సిసి టివిలకు దీనిని అనుసంధానం చేయనున్నారు. శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహిచడం, సమగ్ర అభివృద్ధికి అన్ని అంశాల్లో రాష్ట్రాన్ని సురక్షితమౌన ప్రదేశంగా మార్చడం కమాండ్ కంట్రోల్ సెంటర్ అండ్ డేటా సెంటర్ నిర్మాణం ఉద్దేశం. కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఏర్పాట్లను డిజిపి మహేందర్ రెడ్డి, ఎల్‌అండ్ టి అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భారీ తెరపై ఏకకాలంలో 5,000 కెమెరాలను వీక్షించే సదుపాయం ఉంది.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద ఏర్పాటవుతున్న సిసి కెమెరాల దృశ్యాలను ఈ కేంద్రం నుంచి పర్యవేక్షించవచ్చు. ఎక్కడ ఏ నేరం జరిగినా వెంటనే పోలీసులు స్పందించే అవకాశం ఉంది. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో నిర్మితమవుతున్న జంట పోలీస్ టవర్లలో ఏర్పాటు కాబోయే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాంతరంగా దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ట్రై కమిషనరేట్లతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటయ్యే సిసి టివిలను అనుసంధానం చేయనున్నారు. ఎల్ అండ్ టి సిసి టివిలు, కమ్యూనిటీ పోలీసింగ్, నేను సైతం ప్రాజెక్ట్‌ల కింద కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న లక్షలాది కెమెరాలను ఈ కేంద్రంలో పర్యవేక్షించే వీలు కలుగుతుంది. ఎల్ అండ్ టి సంస్థ సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లలో 10,000 అధునాతన కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. వీటి ఏర్పాటుతో ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులు పారిపోయే మార్గాల్ని నిశితంగా పర్యవేక్షించే అవకాశం కలుగుతుంది.

దేశంలోని 65శాతం సిసిటివిలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. హైదరాబాద్‌లో 7లక్షల సిసిటివిలు ఉండగా, సైబరాబాద్‌లో 1.20లక్షల సిసిటివిలు ఉన్నాయని తెలిపారు. వీటిలో 20,000ల సిసిటివిలను కమ్యూనిటీ పోలిసింగ్‌లో భాగంగా ప్రజలే సమకూర్చుకున్నారని అన్నారు. సిసిటివిల ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌కు పోతే దొరికిపోతామనే భయం దొంగలకు ఏర్పడిందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు అనేక కేసులను పరిష్కరించారని అన్నారు. భవిషత్త్లు పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్, డేటా సెంటర్‌కు డయల్ 100ను అనుసందానించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డిజి జితేందర్, డిసిపిలు ప్రకాష్ రెడ్డి, ఎస్‌ఎం విజయ్‌కుమార్, రోహిణి ప్రియదర్శిని, ఎల్ అండ్ టి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News