Saturday, May 4, 2024

వేలకోట్లకు పడగలెత్తిన నాగరాజు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకలో రాష్ట్ర మంత్రి ఎన్ నాగరాజు ఆస్తుల విలువ రూ 1,609 కోట్లు అని వెల్లడైంది. ఈ విధంగా ఆయన దేశ రాజకీయ నాయకులలో అత్యంత సంపన్నుడి స్థానం పొందారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో తన నామినేషన్ దాఖలు సందర్భంగా పత్రాలలో ఆయన ఈ మేరకు తనకు ఆస్తులు ఉన్నాయని అఫడవిట్‌లో పొందుపర్చారు. బెంగళూరు శివార్లలోని హోస్కోటే నియోజకవర్గం నుంచి ఈ వేలకోటీశ్వరుడు బిజెపి అభ్యర్థిగా సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తాను వ్యవసాయదారుడిని, వ్యాపారాలు కూడా ఉన్నాయని ఆయన తెలియచేసుకున్నారు. తనకు తన భార్యకు కలిపి చరాస్థులు రూ 536 కోట్ల విలువచేస్తాయని, ఇక స్థిరాస్తుల విలువ రూ 1073 కోట్లు అని వివరించారు.

ఈ విధంగా ఈ బిజెపి మంత్రి ఆస్తుల లెక్క మొత్తం ఎంత అనేది తెలింది. నాగరాజు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. 2020లో ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు దశలో ఆయన తన ఆస్తుల వివరాలను రూ 1,220 కోట్లుగా చూపారు. ఇప్పుడు ఇవి ఎగబాకాయి. 72 సంవత్సరాల నాగరాజు కేవలం తొమ్మిదో తరగతి వరకూ చదివారు. తన ఆదాయ వనరులు కేవలం వ్యవసాయం, వాప్యారాలు నుంచి అని తెలియచేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ టికెట్‌పై హస్కోటే నియోజకవర్గం నుంచి గెలిచారు. తరువాత ఏడాదికి పార్టీ మారిన 17 మంది ఎమ్మెల్యేలలో ఒకరిగా నాగరాజు ఉన్నారు. వీరి పిరాయింపులతోనే అప్పట్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ జెడిఎస్ ప్రభుత్వం కూలిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News