మన తెలంగాణ/కాటారం: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు రేపు కాటారంలో పర్యటించనున్నట్లు కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కాటారం సబ్ డివిజన్‌లోని మహాముత్తారం, పలిమెల, మహాదేవపూర్, మల్హార్‌రావు, కాటారం మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, సిఎమ్మార్‌ఎఫ్ చెక్కులు, కళ్యాణలక్ష్మీచెక్కులు, మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీపాద చిల్డ్రన్ పార్కు, మద్దులపల్లి, ధర్మసాగర్,అంకుషాపూర్, రేగులగూడెం నూతనంగా మంజూరైన గ్రామపంచాయితీ భవనాలు, అంగన్వాడీ భవనాలకు శంఖుస్థాపన చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఏఎంసీ పాలకవర్గం ప్రమాణస్వీకారం…
కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరు కానున్నారు. ఏఎంసీ చైర్‌పర్సన్‌గా పంతకాని తిర్మల సమ్మయ్య, వైస్ చైర్మన్‌తో పాటు సభ్యులతో కూడిన పాలకవర్గం ప్రమాణస్వీకారం చేయనున్నారు.