Sunday, April 28, 2024

బొద్దల గడ్డ కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్వాతంత్రం సిద్దించిన 75 ఏళ్ల కాలంలో బొద్దల గడ్డ అభివృద్ది కోసం ఎవ్వరూ ఆలోచించలేదని కేవలం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకే అది సాధ్యమైందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రతిపక్షాల నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డిన తలసాని దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడితో సహా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా స్మశాన వాటిక అభివృద్ది కోసం ఆలోంచించాలి ఒక బొద్దలగడ్డనైనా అభివృద్ది చేశారా చెప్పాలని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ యుత్ డిక్లరేషన్ పేరుతో నగరవాసులను మభ్యపెట్టే ప్రయత్నాం చేశారని, 45 ఏళ్లకు పైగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్య కారణం అప్పటీ ప్రభుత్వాలు కావా సమాధానం చెప్పాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్దికి సహాకరించే సోయి లేని బిజెపి అభివృద్దిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అమెరికాలో వైట్ హౌస్ , భారత దేశంలో తెలంగాణ సచివాలమయే అన్న రీతిలో నిర్మాణం జరిగిందన్నారు. నూతన సచివాలయం నిర్మాణాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పడు అందులోకి వచ్చేందుకు ధర్నాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ సుంకరి రాజు, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ , జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ యుబిడి అడిషనల్ కమిషనర్ వి.కృష్ణ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌సి రత్నాకర్ స్థానిక పలువురు కార్పొరేటర్ మహేశ్వరీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం రూ.45 లక్షల విలువగల రెండు వైకుంఠ రథాలను విరాళంగా ఇచ్చిన నర్సింహ్మారెడ్డితో పాటు మినాక్షి ప్రతినిధిని మంత్రి కెటిఆర్ ఘనంగా సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News