Monday, April 29, 2024

బిజెపి పైసా ఇవ్వలే: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు ఆకాల వర్షంతో హైదరాబాద్ నగరం వరద ముంపులో చిక్కుకుంటే నీట మునిగిన నగరవాసులను రాష్ట్ర ప్రభుత్వం రూ.640 కోట్లతో ఆదుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నయా పైసా అయినా సహాయం చేసిందా అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. టూరిస్టులా వచ్చి పోయే ప్రతిపక్ష పార్టీల నాయకులు నోరు ఉంది కదా అన్ని వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, తాము మాట్లాడదల్చుకుంటే వారి కంటే ఎక్కువగా మాట్లాడుతామని అయితే అది తమ విధానం కాదని, అందుకే వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృదిని కళ్ళు ఉండి కూడ చూడలేని కబోదుల ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని, తాము మాత్రం గెలిపించిన ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో రాజకీయ స్థిరత్వంతో పాటు మంచి ప్రభుత్వము, కేసీఆర్ లాంటి ఆలోచన కలిగిన నాయకుడు ఉన్న కారణగానే ఐటి, ఇండస్ట్రీ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మౌలిక వసతుల కల్పనకు ్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందని, పల్లె ప్రగతిలో పట్టణ ప్రగతిలో చాలా పనులు చేశాం కాబట్టే దేశస్థాయిలో అనేక అవార్డులు మనకు వస్తున్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News