Tuesday, April 30, 2024

ఢిల్లీ పేలుడులో కొత్త ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

Minor blast near Israel Embassy in Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇజ్రాయెలీ ఎంబసి ముందు జరిగిన బాంబు పేలుడులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఘటనాస్థలిలో ఒక లెటర్ స్వాధీనం చేసుకున్నారు. ”ఇది ట్రైలర్” మాత్రమేనని లెటర్ లో రాసినట్టు అధికారులు గుర్తించారు. ఇరాన్ కు చెందిన వ్యక్తే పేలుడు జరగడానికి కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది దాడుల్లో మృతిచెందిన ఇరాన్ జనరల్ ఖాసీం సోలెమనీ, ఆ దేశ అణ్వస్త్ర శాస్త్రవేత్త మోహ్సెన్ ఫక్రీజాదెల పేర్లు ఆ లేఖలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలంలో సిసిటివి ఫుటేజీ పరిశీలిస్తున్నారు. అందులో ఇద్దరు అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తించారు. దర్యాప్తు బృందాలు పేలుడు జరిగిన స్థలంలో సగం కాలిన పింక్ చున్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇజ్రాయిల్ దర్యాప్తు బృందం శనివారం  భారత్ కు రానుంది. పేలుడు ఘటనపై ఇజ్రాయిల్ ప్రధానికి అజిత్ దోవల్ వివరించనున్నారు. ఈ సంఘటనతో దేశంలో ఉన్న అన్ని విమానాశ్రయాల దగ్గర హై అలర్ట్ ప్రకటించి భద్రతను పెంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News