Tuesday, April 30, 2024

కాంగ్రెస్ లో జగ్గారెడ్డి లేఖల కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డ మరోసారి నోరు విప్పారు. ఆవేదన పేరుతో జగ్గారెడ్డి లేఖ విడుదల చేశారు.
గాంధీభవన్‌లో ప్రెండ్లీ పాలిటిక్స్ కరువయ్యాయని ఆరోపించారు. గురువారం జగ్గారెడ్డి ఆవేదన పేరుతో లేఖను విడుదల చేశారు. ఆవేదన పేరుతో జగ్గారెడ్డి వరుసగా లేఖలను వడుదల చేయడం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చకు కారణమైంది. గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదన్నారు. తాను ను ఎవరి పేర్లు చెప్పదల్చుకోలేదని చెప్పారు. కార్యకర్తలు,అభిమానులకు తెలియాలనేది తన ఆవేదనగా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. గాంధీ భవన్ లో ప్రశాంతత కరువైందన్నారు. దాదాపు ఐదు మాసాలుగా జగ్గారెడ్డి గాంధీభవన్ కు దూరంగా ఉన్నారు.

గతంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి ఒంటికాలిపై విమర్శలు చేశారు. ఆ తర్వాత ఈ విమర్శలను కొంత కాలంగా నిలిపి వేశారు నియోజకవర్గంపైనే జగ్గారెడ్డి కేంద్రీకరించారు. హైద్రాబాద్ సిఎల్‌పి కార్యాలయానికి వస్తున్నా కూడా వివాదాస్పద విషయాలపై నోరు మెదపలేదు. పార్టీ అంతర్గత అంశాలపై కూడా ఆయన మాట్లాడలేదు. కానీ ఆకస్మాత్తుగా జగ్గారెడ్డి లేఖలు విడుదల చేయడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు, పిసిసిచీఫ్ రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ ఉంది. మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి జగ్గారెడ్డి అత్యంత సన్నిహితుడుగా పేరుంది. ఆవేదన పేరుతో జగ్గారెడ్డి లేఖల విడుదల వెనుక వ్యూహం ఏముందనే విషయమై పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ నాయకత్వం పట్టుదలతో ఉంది. అయితే పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం ఆ పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. పార్టీ అంతర్గత అంశాలపై పార్టీ వేదికలపైనే చర్చించాలని పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణ నేతలకు సూచించారు. మీడియా వద్ద ఈ అంశాలపై మాట్లాడితే చర్యలు తీసుకొంటామని కూడా ఆయన హెచ్చరించారు. పార్టీ వేదికలపై కాకుండా బయట మాట్లాడితే పార్టీకి నస్టమని ఆయన తేల్చి చెప్పారు. జగ్గారెడ్డి ఈ లేఖలు విడుదల చేయడంపై పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News