Wednesday, March 22, 2023

ఇద్దరు గన్‌మెన్లను తిప్పిపంపిన ఎంఎల్‌ఎ కోటంరెడ్డి

- Advertisement -

హైదరాబాద్ ః తనకు రక్షణగా ఉన్న గన్‌మెన్లను తగ్గించిన ప్రభుత్వానికి తానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానంటూ మిగిలిన ఇద్దరు గన్‌మెన్లను తిప్పిపంపారు రెబల్ వైసీసీ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయనకు రక్షణగా ఉన్న నలుగురు గన్‌మెన్లలో ఇద్దరిని ప్రభుత్వం తొలగించింది. దీంతో ఆయన ఉన్న ఇద్దరు గన్‌మెన్లను కూడా వెనక్కిపంపించారు. తనకు గన్‌మెన్లను తొలగించినంత మాత్రాన భయపడనన్నారు, తన గొంతు పెరిగేదే తప్ప తగ్గేదే లేదన్నారు.

ఏమైనా చేసుకోండి, రోజు రోజుకూ తన గొంతు వినిపిస్తూనే ఉంటా, ఎంత దురమైనా వెళ్తానని జగన్ సర్కార్‌ను ఆయన హెచ్చరించారు. గన్‌మెన్లను ప్రభుత్వానికి తిప్పి పంపుతున్న సమయంలో ఇద్దరు గన్‌మెన్‌లు ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News