Tuesday, April 30, 2024

ఐటిలో ట్విట్టర్, ఫేస్ బుక్ పోస్టులకే మీరు పరిమితం: యెన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత ప్రభుత్వంలో వందలకొద్దీ దొంగ జీవోలు ఇచ్చారని, ఆ కుటుంబానికి, అధికారులకు ప్రజలకు వేర్వేరుగా జీవోలు ఇచ్చారని ఎంఎల్‌ఎ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దొంగ జీవోలతో బిఆర్‌ఎస్ నేతలు భూములు కొట్టేశారని దుయ్యబట్టారు. గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా యెన్నం మాట్లాడారు.  సాగర్, శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ పార్టీయేనని కానీ ఇప్పటికి చెక్కుచెదరలేదన్నారు. పదేళ్లుగా మీరు కట్టినవి వరుసగా కూలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లా ప్రజలకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మోసం చేశారని, పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు కెసిఆర్ మొండిచేయి చూపించారని యెన్నం విమర్శలు గుప్పించారు. దావోస్ సదస్సుపై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేయడం తగదని, దావోస్ సదస్సులో రూ.40 వేల కోట్ల ప్రాజెక్టులకు సంతకాలు చేశామని చెప్పారు.

తొలి సదస్సులోనే రూ.40 వేల కోట్ల ప్రాజెక్టులా అని దేశ ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. పదేళ్లుగా ఐటి రంగంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని అడిగారు. పదేళ్లుగా ఫొటోలు, సెల్ఫీలు, ఫేస్‌బుక్, ట్విట్టర్ పోస్టులకు పరిమితమయ్యారని యెన్నం ధ్వజమెత్తారు. నెల రోజులు కాకముందే తమ ప్రభుత్వం విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. చట్ట బద్ధంగా అవినీతిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్సిస్తుంటే ఎందుకు విమర్శలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ నేతలను అడిగారు. తెలంగాణ బిడ్డలకు పదేళ్ల తరువాత స్వేచ్ఛ వచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News