హైదరాబాద్: శేరిలింగంపల్లి బీఆర్ఎస్ మీటింగ్ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును హౌస్ అరెస్టు చేశారు. శంబీపూర్ రాజు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. శంబీపూర్ ఇంటిలోకి ఎవరిని రానివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా భారీ బందోబస్తుతో పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎంఎల్ఎ కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గురువారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ , కౌశిక్ రెడ్డిలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ వెళ్లడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం విధితమే.
- Advertisement -