Tuesday, May 21, 2024

వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలి: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Telugu Entertainment news,Tollywood news,Tollywood Updates,Mana Telangana news, Telangana Online News,Bollywood Latest updates

హైదరాబాద్: డిసెంబర్ 23న జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత ఆనందంగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు దినోత్సవం రోజున రైతులు నిరసన తెలిపాల్సిన పరిస్థితి వచ్చిందిన్నారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని నిరంజన్ డిమాండ్ చేశారు. ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో రైతులు దీక్షలు చేపట్టారన్నారు. దేశ వ్యాప్తంగా రైతులకు మద్దతుగా రైతులు రోడ్లపైకి వస్తున్నారని ప్రశంసించారు. పంటలకు మద్దతు ధర అంశాన్ని చట్టంలో చేర్చాల్సిన అవసరం ఉందని, మద్దతు ధరకు పంటల కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వాలని సూచించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయడంతో పాటు పది డిమాండ్లను మోడీ ప్రభుత్వం బేషరుతుగా అంగీకరించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News