Wednesday, May 1, 2024

పివి గొప్ప పరిపాలనదక్షుడు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

pv narasimha rao is great ruler in India

హైదరాబాద్: మాజీ ప్రధాని పివి నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని సిఎం కెసిఆర్ కొనియాడారు. పివి వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నామని కెసిఆర్ వివరించారు. ఆర్థిక, విద్య, భూపరిపాలన తదితర రంగాలలో పివి ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారత దేశం అనుభవిస్తోందన్నారు. అంతర్గత భద్రత వ్యవహారాల్లోనూ, విదేశాంగ వ్యవహారాల్లోనూ పివి అవలంభించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి, దేశ సమగ్రతను, సార్వబౌమత్వాన్ని పటిష్టపరిచిందన్నారు. బహుభాషావేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలనదక్షుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలందించిన పివికి ఘనమైన నివాళులర్పించారు. పివి శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం బాధ్యతో నిర్వహిస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News