Monday, May 13, 2024

కరోనా చీకట్లను కాంతితో చీల్చుదాం

- Advertisement -
- Advertisement -

modi video conference

 

రేపు రాత్రి 9గంటలకు లైట్లు బంద్ చేసి దీపాలు వెలిగిద్దాం, కొవ్వొత్తులు, ఫోన్ ఫ్లాష్ లైట్ల వెలుగులతో ప్రకాశింపజేద్దాం
మరోసారి జనతాకర్ఫూ స్ఫూర్తి చాటండి
ఇదే సంకల్పంతో కరోనాను ఎదురిద్దాం
– వీడియో సందేశంలో ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీ: భారతీయులందరూ ఏకమై కరోనా మహమ్మారిని తరిమి కొ డతారన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తం చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ శుక్రవారం ఉదయం దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ మేము ఒక్కరమే ఇంట్లో ఉండి ఏం సాధిస్తామని ప్రజలు అనుకొంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్లే. జనతా కర్ఫూ ద్వారా దేశ ప్రజలు తమ శక్తిసామర్థాలను చాటారు. భారత దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మన బాటలోనే నడుస్తున్నాయి. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా పాటించాలి. ఈ ఆదివారం దేశ ప్రజలంతా కరోనాను తిప్పికొట్టే సంకల్పం తీసుకోవాలి. కరోనా మహమ్మారి అనే అంధకారాన్ని పారదోలి.. మనం నిరంతరం ప్రకాశం వైపు సాగాలి. ఈ ఆదివారం (ఏప్రిల్ 5న)మనమంతా కలిసి కరోనా అనే అంధకారాన్ని తరిమికొట్టాలి.130 కోట్ల మంది ప్రజల మహాసంకల్పాన్ని మనం మరింత ఘనంగా చాటి చెప్పాలి.

ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు బంద్ చేసి టార్చ్, మొబైల్ లైట్లు, కొవ్వొత్తులు, దివ్వెలు వెలిగించాలి. ఆ ప్రకాశంలో మనం మనసులో నేను ఒంటరి కాదనే సంకల్పాన్ని చేసుకోవాలి. ఈ కార్యక్రమం జరిగినంత సేపు ఎవ్వరూ రోడ్లపైకి రావద్దు. మీ అమూల్యమైన సమయాన్ని నాకు ఇవ్వాలని కోరుతున్నా. సంకట సమయంలో ఇది భారతీయులకు నూతన శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది.మన సంకల్పాన్ని మించిన శక్తి ప్రపంచంలో ఏదీ ఉండదు. సామాజిక దూరమనే లక్ష్మణ రేఖను ఎవరూ దాటొద్దు. కరోనా చైన్‌ను తెంచేంకు సామాజిక దూరమే మన దగ్గరున్న రామబాణం. కరోనాపై పోరాడుతున్న అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.

మీ మాటే కాదు.. మా మాటకూడా వినండి : కాంగ్రెస్
ప్రజలు మీ మాటలు వినడమే కాదు, మీరు కూడా ప్రజల మాటలు వినాలంటూ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన వీడియో సందేశంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. సింబాలిజం ముఖ్యమే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక స్థితి పురోగమనానికి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ప్రధానికి సూచించారు. ఆర్థిక వృద్ధి పురోగమనానికి చర్యలు తీసుకుంటారేమోనని ప్రతి ఉద్యోగి, వ్యాపారి, రోజువారీ కూలీ ఊహించారని, మీ సందేశం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చిదంబరం ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

 

Modi said Let lights off and candels lit
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News