Tuesday, May 7, 2024

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మరింత నియంత్రణ కోరుకుంటున్న కొన్ని దేశాలు!

- Advertisement -
- Advertisement -
Indo-pacific region dialogue
నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ వెల్లడి

న్యూఢిల్లీ: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మరింత పట్టు సాధించేందుకు కొన్ని దేశాలు ‘ల్యాండ్ సెంట్రిక్ టెరిటోరియల్ మైండ్‌సెట్’ను అనుసరిస్తున్నాయని బుధవారం నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ వెల్లడించారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకుతనం చర్యలు గురించి ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ మాట అన్నారు. వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనీ, తైవాన్ వంటి దేశాలతో చైనాకు సార్వభౌమత్వంకు సంబంధించిన వివాదాలు చాలా కాలంగా ఉన్నాయన్నారు. అడ్మిరల్ కరంబీర్ ‘ఇండో-పసిఫిక్ రీజినల్ డైలాగ్ 2021’ సమావేశంలో ప్రసంగిస్తూ ఈ విషయాలు చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రోజురోజుకి ‘ప్రభావం, లీవరేజ్, జియోస్ట్రాటెజిక్ స్పేస్’ పోటీ పెరిగిపోతోందన్నారు. ప్రపంచ వ్యాపారంలో 50 శాతం ఇండో-పసిఫిక్ ప్రాంతం నుంచే జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలోని దేశాలు తమ ప్రధాన వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ ప్రాంతాన్ని స్వేచ్ఛగా ఉండనివ్వాలని కోరుకుంటున్నాయన్నారు. ఇదిలావుండగా దక్షిణ చైనా సముద్రంలో చైనా దాదాపు 90 శాతం తమదేనని వాదిస్తోంది. కాగా ‘ఇండో-పసిఫిక్ రీజినల్ డైలాగ్2021’లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ‘యుఎన్‌సిఎల్‌ఒఎస్‌లో పొందుపరిచిన అన్ని దేశాల హక్కులను భారత్ గౌరవిస్తుంది. ప్రాంతీయ జల ప్రాంతం, ప్రత్యేక ఎకనామీ జోన్ విషయంలో భారత్ తన చట్టబద్ద హక్కులను పరిరక్షించుకుంటుంది’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News