Tuesday, May 7, 2024

స్పైక్ ప్రోటీన్‌పై 30కిపైగా మ్యుటేషన్లు

- Advertisement -
- Advertisement -
More than 30 mutations on spike protein
వ్యాక్సిన్లను తప్పించుకునేలా ఉంది:  ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్‌లో 30కిపైగా మ్యుటేషన్లు(ఉత్పరివర్తనాలు) జరగడంతో మానవ రోగనిరోధక వ్యవస్థను(ఇమ్యూనిటీని) తప్పించుకునే అవకాశమున్నదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్‌గులేరియా అన్నారు. భారత్‌లో వినియోగిస్తున్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఏమేరకు పని చేస్తాయన్నది సమగ్రంగా మూల్యాంకనం చేయాలని ఆయన సూచించారు. స్పైక్ ప్రోటీన్ వల్లే కరోనా వైరస్ మానవ శరీర కణాల్లోకి చొచ్చుకువెళ్తుందన్న ఉద్దేశంతో వ్యాక్సిన్లను ఆ ప్రోటీన్ లక్షంగానే రూపొందించారు. దాంతో, ఈ వేరియంట్‌ను అడ్డుకోవడంలో వ్యాక్సిన్ల సామర్థం ఏమేరకుంటుందన్నది అనుమానాస్పదమైంది. ఒమిక్రాన్ వ్యాప్తిరేట్, ఇమ్యూనిటీని అది తప్పించుకునేతీరుపై మరింత సమాచారం అందిన తర్వాతే, దానికి ఎలా అడ్డుకట్ట వేయాలో అంచనాకు రాగలమని గులేరియా తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘాను పటిష్టం చేయాలని, ఏదైనా ప్రాంతంలో కేసులు అధికంగా నమోదైతే నిశితంగా పరిశీలించాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్లు తీసుకోవాలని, కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News