Saturday, May 4, 2024

అఖిల్ ను ఆటపట్టిస్తున్న పూజా హెగ్డే..

- Advertisement -
- Advertisement -

Most Eligible Bachelor new poster released

హైద‌రాబాద్: యంగ్ హీరో అక్కినేని అఖిల్, అందాల భామ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్’. గీతా ఆర్ట్స్-2 బ్యాన‌ర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే విడుదలై ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో అఖిల్ సోఫాలో ల్యాప్ టాప్ ప‌ట్టుకుని ప‌నిచేసుకుంటుంటే.. పూజా వెనుక నుంచి తన కాళ్లతో తాకుతూ అఖిల్ ను ఆట‌ప‌ట్టిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గోపిసుంద‌ర్ సంగీత అందిస్తున్నాడు. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. అన్ని కుదిరితే.. 2021, సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు చిత్రయూనిట్ స‌న్నాహాలు చేస్తుంది.

Most Eligible Bachelor new poster release

Most Eligible Bachelor new poster release

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News