Wednesday, May 1, 2024

భారత్ చేరుకున్న రఫేల్ యుద్ధ విమానాలు..

- Advertisement -
- Advertisement -

5 Rafale Jet touch down at Ambala Air Base in India

న్యూఢిల్లీ: భారత్ వైమానిక దళం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న అత్యంత ఆధునిక రఫేల్ మొదటి బ్యాచ్ ఐదు యుద్ధ విమానాలు ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత్‌కు చేరుకున్నాయి. దాదాపు ఏడు వేల కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించిన రఫేల్ విమానాలు బుధవారం హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ఈ సందర్భంగా ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ‘రఫేల్ విమానాలు ఇండియాలో ల్యాండ్ అవ్వడంతో దేశ సైనిక చ‌రిత్ర‌లో కొత్త శ‌కం మొద‌లైంది’ అని ట్వీట్ చేశారు. 17వ గోల్డెన్ యారో స్క్వాడ్ర‌న్‌లో ఈ విమానాలు చేరనున్నాయి. ఆగస్టులో మరికొన్ని రెండో బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాలు ఇండియాకు రానున్నాయి. ఫ్రాన్స్‌కు చెందిన ద‌సాల్డ్ కంపెనీ త‌యారు చేసే ఈ యుద్ధ విమానాలను భార‌త్ కొనుగోలుచేసింది. మొత్తం 36 రాఫెల్ విమానాలను 60 వేల కోట్ల‌తో ఒప్పందం కుదిరింది. దీంట్లో 30 రఫేల్ ఫైట‌ర్ జెట్స్, ఆరు ట్రైనీ విమానాలు ఉన్నాయి. ముందుగా ఫ్రాన్స్ 5 రఫేల్ విమానాల‌ను భారత్ కు అప్ప‌గించింది.

5 Rafale Jets touch down at Ambala Air Base

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News