Saturday, May 4, 2024

దళిత నాయకుడు కెసిఆర్: మోత్కుపల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దళిత బంధు లాంటి కార్యక్రమం సిఎం కెసిఆర్ తప్ప దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టే దైర్యం చేయలేదని మాజీ మంత్రి మోత్కుపలి నర్సింహులు తెలిపారు. బిజెపికి రాజీనామా చేసిన సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. 60 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి మంచి కార్యక్రమం చూడలేదన్నారు. సిఎం కెసిఆర్‌ను దళిత వర్గ నాయకుడిగా గుర్తించాలని, ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తున్న మొనగాడు కెసిఆర్ అని ప్రశంసించారు.

రైతు బంధు మాదిరిగా దళిత బంధును దళితుల ఖాతాలో వేస్తామని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. భారత దేశంలో దళితులు ఎన్నో బాధలు పడుతున్నారని, దళితులను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. దళిత బంధు గురించి సిఎం కెసిఆర్ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారని, దళిత బంధుపై సలహాలు ఇవ్వమని కెసిఆర్ కోరారన్నారు. పది లక్షల రూపాయలతో ఎలాంటి వ్యాపారం చేయలన్నాదే దళితులే నిర్ణయించుకోవాలన్నారు. దళితుల అభ్యున్నతికి ఎన్ని లక్షల కోట్లయినా ఇస్తామని కెసిఆర్ చెప్పారన్నారు. మరియమ్మ లాక్‌డెత్ కేసులో బాధ్యులను డిస్మిస్ చేయాలని తాను కోరానని, దళిత వర్గాలకు తాను ఉన్నానంటూ వారిని కెసిఆర్ డిస్మిస్ చేశారని గుర్తు చేశారు.

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జాలపై ఒక దళితుడిగా స్పందించానని మోత్కుపల్లి తెలిపారు. దళితుల భూములను ఈటెల వాపస్ ఇవ్వాలని మొదట్నుంటి చెబుతున్నానని, ఒక వ్యక్తిని పార్టీలో చేర్చుకునేముందు క్రెడిబిలిటీ చూడాలని బిజెపికి చురకలంటించారు. ఈటెల మీద సానుభూతి ఎందుకు చూపించాలని బిజెపిని ప్రశ్నించారు. ఈటెలను బిజెపి ఎందుకు నెత్తిన మోస్తోందని చెప్పాలని నిలదీశారు. పోటీకి అర్హతలేని వ్యక్తి ఈటెల అని మండిపడ్డారు. దళిత పేద వర్గాలు ఈటెలను ఓడించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News