Sunday, May 5, 2024

వెళ్లకున్నా..టోల్ వొలుస్తున్రు!

- Advertisement -
- Advertisement -

మన మహబూబ్‌నగర్ జిల్లాలో మున్ననూర్ టోల్ ప్లాజా వద్ద వాహనదారులు ఆందోళన చేపట్టా రు. టోల్ ప్లాజా ద్వారా తమ వాహనాలు వెళ్లకున్నా.. వెళ్లినట్టు నమోదై ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా నగదు ఉపసంహరించుకుంటున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.తమ వా హనాలు ఇంట్లోనే ఉన్నప్పటికీ టోల్ ప్లా జా ద్వారా వెళ్లినట్లు నమోదై ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా టోల్ రుసుము కట్ అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వా రం రోజుల నుంచి తమకి ఈ సమస్య ఎదురైందని.. పరిష్కరించి తమ నగదును తిరిగి చెల్లించాలని టోల్ గేట్ నిర్వాహకులను కోరిన పరిష్కార ‘దిశగా చర్యలు చే పట్టడం లేదని మండిపడ్డారు. దీంతో తమ కు న్యాయం చేయాలంటూ జడ్చర్ల- కల్వకుర్తి మధ్యన ఎన్‌హెచ్ 167 జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్దకు బాధితులంతా చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వాహనదారులకు సర్ది చెప్పారు. సాంకేతిక కారణాలతో ఇలా జరిగిందని పేర్కొన్న టోల్ ప్లాజా నిర్వాహకులు వారి నగదును తిరిగి అందజేశారు.
మా వద్ద టోల్ ప్లాజా లేదు : అటవీశాఖ
అమ్రాబాద్ టైగర్ రిజర్వులోని మన్ననూరులో టోల్ ప్లాజా లేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. అచ్చంపేట నుంచి శ్రీశైలం వెళ్లే వాహనాలకు మన్ననూరు వద్ద రూ.20 టోకెన్ రసీదు రూపంలో ఇస్తామని వెల్లడించారు. ప్రచార మాథ్యమాల్లో మన్ననూర్ ప్రచారం కావడంతో.. నాగర్‌కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి స్పందించారు. ఇది నల్లమలలోని మన్ననూరు కాదని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జాతీయ రహదారిపైనున్న మున్ననూరు టోల్‌ప్లాజాగా గమనించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News