Tuesday, April 30, 2024

వాస్తవ సంఘటనల ఆధారంగా…

- Advertisement -
- Advertisement -

Mr. and Miss

 

డేటింగ్‌లు, వీడియో చాటింగ్‌లు ప్రేమలో భాగమైన ఈ తరం ప్రేమ కథగా ‘మిస్టర్ అండ్ మిస్’ చిత్రం రూపొందింది. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నేను పెద్ద సినిమా, చిన్న సినిమా అనేది నమ్మను. మంచి సినిమానా కాదా అనేది నమ్ముతాను. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను”అని అన్నారు.

హీరోయిన్ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ “మేము అందరూ కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో ఉన్న పాయింట్ అందరినీ ఆలోచింపజేస్తుంది. డైరెక్టర్ అశోక్ సినిమాను బాగా తీశారు. మార్చి చివరలో వస్తోన్న మా సినిమాను చూసి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. హీరో శైలేష్ సన్నీ మాట్లాడుతూ “మా సినిమాకు క్రౌడ్ సపోర్ట్ ఉంది. రేపు సినిమా విడుదల తరువాత ప్రేక్షకుల సపోర్ట్ మాకు ఉంటుందని నమ్ముతున్నాను”అని పేర్కొన్నారు. డైరెక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ “ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. క్రౌడ్ ఫండింగ్ చేసి ఈ సినిమా చేశాం. కొన్ని వాస్తవ సంఘటనలఆధారంగా ఈ సినిమా చేయడం జరిగింది”అని అన్నారు.

Mr. and Miss movie trailer release
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News