Friday, May 3, 2024

త్వరలో ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులోకి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి త్వరలో ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులోకి తీసుకరానున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిజిహెచ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, ప్రిన్సిపాల్ ఇందిరాలను ఆదేశించారు. నిజామాబాద్ ప్రభుత్వ దావాఖానాలో క్యాట్రట్ (కంటి) ఆపరేషన్లు రోజుకు 40 వరకు పెంచాలని మోకాలి చిప్ప ఆపరేషన్లు ముందులా రికార్డ్ స్థాయిలో పూర్తి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు అన్నారు.

ఎంఆర్‌ఐ కూడా చాలా ముఖ్యమైనదని త్వరలో నిజామాబాద్‌కు ఈ సేవలు అందించ నున్నామని అన్నారు. నిజామాబాద్ జిజిఎచ్ డాక్టర్లకు డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. నిజామాబాద్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నందున మంచి వైద్యం అందించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌ను ఆదేశించారు. అనంతరం సూపరింటెండెంట్ మాట్లాడుతూ పేషెంట్ నమోదు ప్రక్రియ ఎలక్ట్రానిక్ హెల్త్ ఇన్నర్మేషన్ సిస్టంతో పాటు 57 రక్త నమూనా టెస్టులు రెడియో కార్డియా, ఎక్సరే, అట్ట్రాసౌండ్ ఈసీజీతో పాటు 77 కొత్త టెస్టులకు శనివారం ప్రారంభించడం జరిగిందని అన్నారు. దాదాపు రెండు కోట్లతో 57 కొత్త టెస్టులకు సంబంధించిన పరికరాలు అందించడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

ఎలక్ట్రో ఫోరెసెస్ పరికరం తెలంగాణలోనే కొన్ని చోట్ల మాత్రమే ఉంటుందని ఆ మెషిన్ మన ప్రభుత్వ ఆసుపత్రిలో (దాదాపు 50 లక్షల రూపాయలు) మిషన్ మనకు అందజేయడం జరిగిందన్నారు. అనంతరం డాక్టర్స్‌డే సందర్బంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌వో సుదర్శనం, హెచ్వోడి నాగేశ్వర్ తదితర డాక్టర్లు, నర్సులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News