Monday, April 29, 2024

తెలంగాణ వైద్యసేవలు దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : వైద్య సేవలు అందించడంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని, దేశంలో ఎక్కడా లేని వైద్య సేవలు తెలంగాణలో అందుతున్నాయని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో టిడయోగ్నస్టిక్‌ను మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్ నుంచి పర్చువల్‌గా ప్రారంభించగా జిల్లా ఆసుపత్రిలో చింత ప్రభాకర్ ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానాలో అన్ని రకాల వైద్య సేవలు, పరీక్షలు ఉచితంగా అందించడం జరుగుతుందని టీ డయోగ్నస్టిక్‌ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా 134రకాల వైద్య పరీక్షలు చేసుకోవచ్చన్నారు.

ఉచింతగా ఎలాంటి ఖర్చులేకుండా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించడమే లక్షంగా పెట్టుకొని ప్రభుత్వం టిడయోగ్నస్టిక్‌లను ప్రారంభించిందన్నారు. హైదరాబాద్‌లో అందే వైద్యసేవలు నేడు బిఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యశాలలో లభిస్తున్నాయన్నారు. తెలంగాణ వైద్యారోగ్యశాఖ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మనుషులకు చిన్న ప్రమాదం జరిగిన నేను ఉన్నానంటూ భరోసానిస్తూ మనుషులను ముందుకు నడిపేవాళ్లు డాకర్లని ఆయన కొనియాడారు. మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటిండెంట్ అనిల్‌కుమార్, సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, నర్సింలు, వైద్యులు, ల్యాబ్‌టెక్నీసియన్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News